టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లిసేన..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 01:37 PM

టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లిసేన..

సెంచూరియన్, ఫిబ్రవరి 4 :సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ నెగ్గిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో విజయం సాధించిన కోహ్లిసేన ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌తో ఖాయా జోండో అరంగేట్రం చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా తాత్కలిక కెప్టెన్‌గా మార్క్‌రమ్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గాయంతో కెప్టెన్‌ డుప్లెసిస్‌ దూరం కాగా ఈ స్థానంలో జోండోను తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఆలౌరౌండర్‌ పెహ్లుకువాయో స్థానంలో స్పిన్నర్‌ తబ్రాజ్ షమ్సీని ఎంపిక చేశారు.

Untitled Document
Advertisements