'దసరా' సినిమాలో తన పాత్రకు తన గాత్రమే ఇచ్చిన కీర్తి

     Written by : smtv Desk | Wed, Apr 12, 2023, 03:37 PM

'దసరా' సినిమాలో తన పాత్రకు తన గాత్రమే ఇచ్చిన  కీర్తి

కీర్తి సురేష్ నటన పరంగా నిజంగానే మహానటి అనిపించుకుంది. తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరి మనసును దోచేస్తున్న అందాల భామ. మహానటితో అందరిని తన మాయలో పడేసిన ఈ అమ్మడు నటన పరంగా నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. పాత్ర ఏదైనా ఆ పాత్రలో ఒదిగిపోవడం కీర్తి సురేశ్ కి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కీర్తి సురేశ్ ఇటీవల 'దసరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల పాత్రలో మాస్ లుక్ తో .. డీ గ్లామర్ రోల్ చేసింది.

తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ కథలో ఆమె తెలంగాణ యాసలోనే డైలాగ్స్ చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకి తానె డబ్బింగ్ చెప్పుకుందంటే చాలామంది నమ్మరు. ఈ నేపథ్యంలోనే ఆమె డబ్బింగ్ చెబుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎంత మాత్రం తడబడకుండా ఆమె డబ్బింగ్ చెబుతున్నప్పటి వీడియో చూస్తే, ఆమె అంకితభావం ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో పెళ్లి కూతురుగా ఒక మ్యూజిక్ లెంగ్త్ లో కీర్తి వేసిన మాస్ స్టెప్పులకు సంబంధించిన వీడియోను అందరూ కూడా విపరీతంగా చూస్తున్నారు .. ఎంజాయ్ చేస్తున్నారు. కథాపరంగా తెలంగాణ నేపథ్యాన్ని కీర్తి ఎంతగా ఆకళింపు చేసుకుందనడానికి ఈ డాన్స్ ను ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.


Untitled Document
Advertisements