సాధారణ గృహిణిలా చార్మినార్ వద్ద షాపింగ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ భార్య

     Written by : smtv Desk | Tue, Apr 18, 2023, 11:36 AM

సాధారణ గృహిణిలా చార్మినార్ వద్ద షాపింగ్ చేసిన  జూనియర్ ఎన్టీఆర్ భార్య

సాధారణంగా స్టార్ హీరో భార్య అంటే భర్త స్టార్ డమ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా దర్జాగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాము. దేశవిదేశాలలో తిరిగి అన్ని బ్రాండెడ్ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇందుకు పూర్తి విరుద్దంగా ఒ స్టార్ హీరో భార్య హైదరాబాద్ లో సాధారణ గృహిణిలా షాపింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె మరెవరో కాదు లక్ష్మీప్రణతి.. టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య. ఒక సూపర్ స్టార్ కు భార్య అయినప్పటికీ ఆమె ఎప్పుడూ ఎంతో సాధారణంగా ఉంటారు. పెద్దగా ఆడంబరాలు లేకుండా ఒక సాధారణ గృహిణిలా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా ఆమె చార్మినార్ వద్ద నైట్ బజార్ లో షాపింగ్ చేశారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సామాన్యమైన వ్యక్తిలా చార్మినార్ కు వచ్చి ఆమె షాపింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక జూనియర్ ఫ్యాన్స్ అయితే ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'వదినమ్మా.. మీరు సూపర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.





Untitled Document
Advertisements