అసలు హీరో అతనే.. వాల్ పై ప్రశంసల జల్లు..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 01:54 PM

అసలు హీరో అతనే.. వాల్ పై ప్రశంసల జల్లు..

మౌంట్‌ మౌంగానుయ్‌, ఫిబ్రవరి 4 : రాహుల్ ద్రావిడ్.. ప్రస్తుతం ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతుంది. భారత్ యువ ఆటగాళ్లు నిన్న జరిగిన ఐసీసీ అండర్-19 కప్ ను నాలుగోవ సారి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ విజయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర మరువలేనిది. మన యువ ఆటగాళ్ల జోరుకు సానా బెట్టి తెర వెనుక తన పాత్రను సమర్ధవంతంగా పోషించిన రాహుల్ ద్రావిడ్ నిజంగా రియల్ హీరో. అందుకే చాలా మంది ప్రముఖులు 'ది గ్రేట్ వాల్' ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఆయన కృషి వెనుక ఎన్నో ఏళ్ల కఠిన శ్రమ దాగివుంది.

సీనియర్ క్రీడాకారులకు కోచ్ గా చేపట్టే అవకాశం ఉన్న అది వదులుకొని అండర్-19 జట్టును భవిష్యత్తు ఆశాకిరణాలుగా తయారుచేసిన ఘనత 'వాల్'కే దక్కింది. అతని నైపుణ్యం, ఆలోచనలు, వృత్తి నిబద్దత, ఇంకా ఎన్నో భారతదేశాన్ని గర్వపడేలా చేశాయి. ఎంతలా అంటే పొరుగు దేశమైన పాక్ క్రీడాప్రముఖులు ద్రావిడ్ ని పొగిడిన విషయం అతని గొప్పదనానికి నిదర్శనం.

ముఖ్యంగా 18-19 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు ఆటలో, పరిణితిలో ఎంతో కొంత అపరిపక్వత కనిపించడం సహజం. కానీ మన యువ కెరటాల్లో అటువంటి పరిస్థితి మచ్చుకైన గోచరించలేదు. అలా వారు అవ్వడానికి కారణం మన మాజీ క్రికెటర్ ద్రావిడ్. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో విషయాలపై ద్రావిడ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

Untitled Document
Advertisements