చీకటి అంటే భయమన్న సాయితేజ్

     Written by : smtv Desk | Wed, Apr 19, 2023, 02:59 PM

చీకటి అంటే భయమన్న సాయితేజ్

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలలో ఒకడైన సాయితేజ్ చాలా గ్యాప్ తరువాత చేసిన చిత్రం 'విరూపాక్ష'. ఇంతవరకూ రొమాంటిక్ టచ్ తో కూడిన మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తూ వచ్చిన సాయితేజ్, తొలిసారిగా చేసిన హారర్ థ్రిల్లర్ ఇది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.

ఈ నెల 21వ తేదీన ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో సాయితేజ్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన సోనియా సింగ్ .. సాయితేజ్ ను ఇంటర్వ్యూ చేసింది. సరదాగా .. సందడిగా ఈ ఇంటర్వ్యూ కొనసాగింది.

సాయితేజ్ మాట్లాడుతూ .. నాకు చీకటి అంటే భయం. అయితే ఈ సినిమా షూటింగు ఎక్కువగా రాత్రివేళల్లోనే చిత్రీకరించారు. భయపడొద్దనీ .. ధైర్యంగా ఉండమని నాతో చెప్పేవారు. "మనం ప్లాన్ చేసిన సౌండ్స్ మాత్రమే వస్తే ఓకే, కొత్తగా వేరే సౌండ్స్ వినిపిస్తే మాత్రం వెంటనే కారు ఎక్కేసి వెళ్లిపోతాను" అని నేను అనేవాడిని. అలా నైట్ షూటింగ్స్ కొంచెం టెన్షన్ తోనే నడిచాయి " అన్నాడు.





Untitled Document
Advertisements