నేను ప్రేమించిన అమ్మాయి గురించి మా కల్యాణ్ మామయ్యకి తెలుసు.. సాయి తేజ్

     Written by : smtv Desk | Thu, Apr 20, 2023, 11:11 AM

నేను ప్రేమించిన అమ్మాయి గురించి మా కల్యాణ్ మామయ్యకి  తెలుసు.. సాయి తేజ్

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలలో ఒకరైన సాయితేజ్ తాజా సినిమా 'విరూపాక్ష' రేపు థియేటర్లకు రానుంది. దాంతో ఆయన మరింత స్పీడ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన లైఫ్ లోని లవ్ స్టోరీస్ గురించి ప్రస్తావించాడు. "నేను అభిమానించే కథానాయిక సమంత.. తనని నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఇక నా కెరియర్ తొలినాళ్లలో నాతో చిత్రాలు చేసిన రెజీనా .. సయామీ అంటే ఇష్టం" అని అన్నాడు.

"నేను లవ్ చేసింది మాత్రం 'తిక్క' సినిమాలో నాతో పాటు చేసిన 'లారిస్సా బొనేసి'. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమించాను. ఆ సినిమాకి సంబంధించి సాంగ్ షూటింగు జరుగుతూ ఉండగా, నా మనసులోని మాటను చెప్పాను. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం ..' అంటూ ఆమెకి విషయం చెప్పేశాను. 'సారీ తేజూ ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు' అని ఆమె చెప్పేసింది. అప్పుడు మాత్రం నా హార్ట్ బ్రేక్ అయింది" అని చెప్పాడు.

"నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. కాకపోతే డిగ్రీ పూర్తయిన తరువాత నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించాను. ఈ విషయం మా అమ్మకి మాత్రమే కాదు .. మా కల్యాణ్ మామయ్యకి కూడా తెలుసు. ఇప్పుడు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అన్నట్టుగా నా పని నేను చేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.





Untitled Document
Advertisements