వెండితెర మీద దూసుకుపోతున్న బుల్లితెర రాములమ్మ

     Written by : smtv Desk | Thu, Apr 20, 2023, 11:40 AM

వెండితెర మీద దూసుకుపోతున్న బుల్లితెర రాములమ్మ

బుల్లి తెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటన మరియు అనడంతో తెర మెడ సందడి చేసే ఈ ముద్దుగుమ్మని ఇష్టపడని వారంటూ ఉండరు. కేవలం శ్రీముఖి కోసమే ఆడియన్స్ ఫాలో అయ్యే కార్యక్రమాలు కొన్ని లేకపోలేదు. ఇక ఒకవైపున టీవీ షోస్ ను వదులుకోకుండానే, మరో వైపున సినిమాలలో కుదురుకోవడానికి శ్రీముఖి ట్రై చేస్తోంది. ఆ దిశగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.

నిజానికి ఒక హీరోయిన్ కి కావలసిన గ్లామర్ శ్రీముఖిలో పుష్కలంగా ఉంది. ఆమెను పూర్తిగా సినిమాల వైపుకు వచ్చేయమనే అభిమానులు కూడా ఉన్నారు. కానీ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలతోనే సరిపెడుతూ వస్తోంది. ఇక గతంలో కంటే ఇప్పుడు ఆమె సినిమాల సంఖ్యను పెంచుతోందనే విషయం మాత్రం అర్థమవుతోంది.

ప్రస్తుతం ఆమె చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇక బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలోను ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపించనుంది. వెంకటేశ్ .. నాగార్జున తాజా ప్రాజెక్టులలోను ఆమె పేరు వినిపిస్తోంది. ఇక తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో చెప్పుకోదగిన పాత్రకోసం ఆమెను తీసుకున్నారనేది టాక్. చూస్తుంటే శ్రీముఖి జోరు పెంచినట్టుగానే కనిపిస్తోంది కదూ. మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాలకే అంకితం అయిపోయినా ఆశ్చర్యం లేదు.





Untitled Document
Advertisements