పరీక్షలకు బదులు ఎలక్షన్స్.. సుష్మా తడబాటు...

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 02:41 PM

పరీక్షలకు బదులు ఎలక్షన్స్.. సుష్మా తడబాటు...

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ "ఎగ్జామ్‌ వారియర్స్‌" పేరుతో పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, ప్రకాశ్‌ జావడేకర్ చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఒక పొరపాటు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ.. మార్చిలో “పరీక్షలు” రానున్నాయని అనాల్సింది పోయి “ఎన్నికలు” రానున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో ఈ కార్యక్రమ౦లో పాల్గొన్న వారంతా నవ్వుకున్నట్లు సమాచారం. వెంటనే సుష్మా.. "నేను ఒక రాజకీయ నేతను కదా.! అందుకే ఎక్కువగా ఎన్నికల గురించే ఆలోచిస్తు౦టా" అని తప్పును సరిచేసుకున్నారు. కాగా ఈ పుస్తకాన్ని పెంగ్విన్‌ ఇండియా ప్రచురించింది.

Untitled Document
Advertisements