ఆ రెండు సినిమాల హిట్ కు కారణం ఏంటో అర్ధం కావట్లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన శాకుంతలం నటి

     Written by : smtv Desk | Thu, Apr 27, 2023, 11:14 AM

ఆ రెండు సినిమాల హిట్ కు కారణం ఏంటో అర్ధం కావట్లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన శాకుంతలం నటి

స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు ప్రొడక్షన్లో సమంత ప్రధాన పాత్ర పోషించిన 'శాకుంతలం' చిత్రం పై ప్రేక్షకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రేక్షకులు మాత్రమె కాదు ఎందులో నటించిన నటీనటులు కూడా సినిమా హిట్ అవడం కాయం అనే అనుకున్నారు. కానీ, ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలను పోషించారు.

తాజాగా ఈ చిత్రం ఫ్లాప్ కావడంపై మధుబాల స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఫెయిల్యూర్ కావడం బాధించిందని ఆమె అన్నారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఎంతో కష్టపడ్డారని తెలిపారు. షూటింగ్ సమయంలో నటులు, టెక్నీషియన్స్ పై కూడా ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఘన విజయం సాధిస్తుందనుకున్న ఈ సినిమా ఫెయిల్ కావడం నిరాశకు గురిచేసిందని అన్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయని.. ఆ చిత్రాలు ఆ రేంజ్ లో ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదని చెప్పారు.





Untitled Document
Advertisements