‘బలగం’వేణు దర్శకత్వంలో నందమూరి నటసింహ సినిమా!

     Written by : smtv Desk | Wed, May 10, 2023, 11:51 AM

 ‘బలగం’వేణు దర్శకత్వంలో నందమూరి నటసింహ సినిమా!

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ‘బలగం’ చిత్రం పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి, హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకన్న వేణు ‘బలగం’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. తన మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకొని అందరినీ ఆశ్చర్య పరిచారు. తెలంగాణ పల్లె సంస్కృతి, కుటుంబాలను కళ్లకు కట్టి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. దీంతో, ఇప్పుడు వేణు తీయబోయే రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు అగ్ర నిర్మాతలు, హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు.

దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే తన తదుపరి సినిమా ఉంటుందని వేణు ఇదివరకే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో తన రెండో సినిమానే బడా హీరో నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం లభించిందని తెలుస్తోంది. బాలయ్యకు ఇప్పటికే కథ చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారని టాలీవుడ్ సమాచారం. అదే నిజమైతే ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ కానుంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements