ఈ టీంతో నా ప్రయాణం చాలా ప్రత్యేక౦: సమంత

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 03:08 PM

ఈ టీంతో నా ప్రయాణం చాలా ప్రత్యేక౦: సమంత

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రామ్ చరణ్-సమంత జోడిగా తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది.

ఇదిలా ఉండగా, హీరోయిన్ సమంత చిత్రానికి సంబందించి ఓ ట్విట్ చేసింది. 'షూటింగ్‌ పూర్తైంది. అత్యంత ప్రత్యేకమైన బృందంతో నా ప్రత్యేక ప్రయాణం. రామ్‌చరణ్‌, సుకుమార్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని ట్విట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Untitled Document
Advertisements