క్రికెట్ దిగ్గజంకు సైతం తప్పని ఫేక్ యాడ్స్ తిప్పలు

     Written by : smtv Desk | Sat, May 13, 2023, 11:39 AM

క్రికెట్ దిగ్గజంకు సైతం తప్పని ఫేక్ యాడ్స్ తిప్పలు

మాములుగా సెలబ్రేటి హోదాలో ఉన్నవారిని దాదాపు సామాన్య ప్రజలు గుర్తుపట్టాడం సహజం. అందుకే వివిధ కంపెనీలు తమ వ్యాపార ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను వారితో ప్రమోట్ చేయిస్తూ ఉంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే , క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు, ఫొటో, వాయిస్ ను ఆయన అనుమతి లేకుండానే వాడుకున్న ఫేక్ యాడ్స్ కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో సచిన్ ఫిర్యాదు చేశాడు. ఒక ఔషధ కంపెనీ వారి ప్రాడక్ట్ ను తాను ఎండార్స్ చేస్తున్నట్టు ఫేక్ ప్రకటనలను ఇస్తోందని తన ఫిర్యాదులో సచిన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 500 (పరువునష్టం)లతో పాటు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.





Untitled Document
Advertisements