వేసవి సమస్యలకు ఇంటి చిట్కాలు

     Written by : smtv Desk | Wed, May 17, 2023, 12:25 PM

వేసవి సమస్యలకు ఇంటి చిట్కాలు

వేసవికాలం విపరీతమైన ఎండలు కాస్తూ మనల్ని ఉపిరి తీసుకోనివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరిపూర్ణ ఆహారం, తగినంత విశ్రాంతి, మండుటెండ నుంచి రక్షణ,చిన్న చిన్న చిట్కాలు,అవసరమైన  వైద్యుల  సలహాలు వేసవిని ఎదుర్కోవడానికి, ఇంతకుమించి జాగ్రత్తలెం ఉంటాయి? నిజమే కదా కానీ ఈ మాత్రం జగ్రత్తలు పాటించకుండా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వేసవిలో మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. ఏదో ఒకటి కడుపులో పడ్డకే కాలు బయట పెట్టాలి లేదంటే నిస్సత్తువ ఆహ్వానిస్తూ. ఎండకు ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం ఏర్పడుతుంది. మంచి భోజనం,పండ్లు, కూరగాయల ముక్కలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మద్యం, కాఫీ, టీ,ధూమపానం.. ఒంట్లోని నీటిని నిల్వల్ని అడుగంట్టేలా చేస్తాయి. కనుక వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మసాలా రుచులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేపుడు కూరలు సమోసాలు మిర్చిబజ్జీలుకు ఆమడ దూరంలో ఉండాలి. అవే కాదు, కొవ్వు ఎక్కువ ఉన్న ఏ పదార్థమైనా దూరం దూరం. ఎందుకంటే ఎండ వేడిని కొవ్వు పై చెడు ప్రభావం చూపుతుంది. వేసవి ప్రకృతి పెట్టే పరీక్ష. పరిష్కారం కూడా ప్రకృతి లోనే ఉంది.. పాలకూర, కీరా,అల్లం,వెల్లుల్లి,బీట్రూట్ వంటివి వేసవి దెబ్బను తట్టుకునే శక్తిని ఇస్తాయి. నీరు అధికంగా ఉండే సొరకాయ, టమాటా,దోసకాయ,పుచ్చకాయ ఎక్కువ తీసుకోవాలి. సొరకాయ అరికాళ్లకు రుద్దుకుంటే వేడి తగ్గిపోతుందని, మొహం మీద కీరా దోసకాయ ముక్కలు పెట్టుకుంటే చల్లదన్నాన్ని ఇస్తుందని, ముఖం మీద మంచి గంధం రాసుకుంటే హాయ్ హాయిగా ఉంటుందని, రోజ్ వాటర్ ని రిఫ్రిజిరేటర్ ఐస్ ట్రేలో పెట్టేసి ఆ ముక్కలతో ఒళ్ళంతా రుద్దుకుంటే ఆనందమే ఆనందం అని.... చాలా చిట్కాలే ప్రపంచంలో ఉన్నాయి. వీటివల్ల వేసవి సమస్యలకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము  కానీ, ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది.





Untitled Document
Advertisements