ఐఆర్ సీటీసీ కొత్త ఆఫర్.. టికెట్ కు డబ్బులు లేకున్నా కోరుకున్న చోటుకి ప్రయాణించవచ్చు!

     Written by : smtv Desk | Wed, May 17, 2023, 02:14 PM

ఐఆర్ సీటీసీ కొత్త ఆఫర్.. టికెట్ కు డబ్బులు లేకున్నా కోరుకున్న చోటుకి ప్రయాణించవచ్చు!

ఇప్పటివరకు మన వద్ద డబ్బులు లేకపోయినా కూడా మనకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడం మనకు తెలిసిన విషయమే. ఎలా అంటారా? ఇంట్లోకి కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేసి, ఆ తర్వాత డబ్బులు చెల్లించే సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఇదే సదుపాయం రైలు ప్రయాణాలకూ వర్తిస్తుంది. ఈ ‘బై నౌ పే లేటర్’ సదుపాయానికి స్వల్ప మార్పులు చేసి ‘ట్రావెల్ నౌ పే లేటర్ (టీఎన్ పీఎల్)’ అంటూ ఐఆర్ సీటీసీ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది.

సమయానికి డబ్బులు అందలేదని ప్రయాణాలు మానుకోవాల్సిన అవసరం లేకుండా ముందు ప్రయాణించి, తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటును కల్పిస్తోంది. దీనికోసం క్యాష్ ఈ, పేటీఎం, ఈ పేలేటర్ సంస్థలతో ఐఆర్ సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

టీఎన్ పీఎల్ సదుపాయం వాడుకోవడం ఎలాగంటే..
పేటీఎంతో.. ఐఆర్ సీటీసీ పోర్టల్ లోకి లాగిన్ అయ్యాక ప్రయాణ వివరాలను ఎంటర్ చేసి బుక్ టికెట్ పై క్లిక్ చేయాలి. పేమెంట్ సెక్షన్ లో పే లేటర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి, పేటీఎం పోస్ట్ పెయిడ్ ను ఎంపిక చేసుకోవాలి. పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయడంతో టికెట్ బుకింగ్ పూర్తవుతుంది.

క్యాష్ ఈ.. ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లోకి లాగిన్ అయ్యాక ప్రయాణ వివరాలను ఎంటర్ చేసి బుక్ టికెట్ పై క్లిక్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ లో టీఎన్ పీఎల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి, క్యాష్ ఈ ను ఎంపిక చేసుకోవాలి. లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఈ పద్ధతిలో టికెట్ బుకింగ్ సొమ్ము మొత్తాన్ని ఈఎంఐ కింద మూడు లేదా ఆరు నెలల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

ఫిన్ టెక్ సంస్థ ఈ పేలేటర్ కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది. అయితే, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 14 రోజుల్లోపల సొమ్ము చెల్లించాలి. ఈ గడువు దాటితే సొమ్ముపై 36 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements