గుండె ఆరోగ్యం కొరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

     Written by : smtv Desk | Fri, May 19, 2023, 02:28 PM

గుండె ఆరోగ్యం కొరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వయసుతో సంబంధం లేకుండా దాదాపు చాలామందిని బీపీ, డయాబెటిక్, కొలెస్ట్రాల్, అధికబరువు వంటి సమస్యలతో భాదపడుతున్నారు. ఈ అనారోగ్యాలు గుండెజబ్బులకు దారితీస్తాయి. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చొప్పున గుండెనొప్పితో చనిపోతున్నారు అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ముందుగా జాగ్రత్త పడడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించవచ్చని డాక్టర్లు అంటున్నారు. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి పరిశోధకులు  అంటున్నారు.
* శరీరానికి ఏదో ఒక పక్క మొద్దుబారి పోయినట్లుగా అనిపించడం.
* హఠాత్తుగా ముఖానికి ఒక పక్కన చెయ్యి కాలు మొద్దుబారినట్లుగా అనిపించడం.
* ఏదో ఒక కన్ను మసకబారవచ్చు లేదా పూర్తిగా కనిపించకపోవచ్చు.
* ఉన్నట్టుండి బాగా తలనొప్పి రావడం.
* హఠాత్తుగా మాటలు తడబడడం లేదా మాట్లాడకపోవడం.
* ఎదుటి వాడి మాటలు అర్థం కాకపోవడం.
* ఏదో తెలీని అలసట, స్పృహ తప్పడం లాంటివి ఏవైనా జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
అయితే జబ్బులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?..
* కొవ్వు పదార్థాలు బాగా తక్కువగా తీసుకోవాలి.
* ఉప్పుని కూడా ఆహారంలో బాగా తగ్గించి తీసుకోవాలి.
* గింజధాన్యాలు, పండ్లు, కూరలు బాగా తీసుకోవాలి.
* రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామం చేయడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి.
* పొగతాగటంమే కాదు, పొగ పీల్చే వారికి దగ్గరగా ఉండడం కూడా ప్రమాదమే. పాసివ్ స్మోకింగ్ కూడా హాని చేస్తుందని గుర్తుంచుకోవాలి.
* స్ట్రోక్ ఫైటింగ్  ఫుడ్ తీసుకోవాలి. క్యారెట్లలో నీతో కెరటిన్ లభిస్తుంది. చేపలు మరియు చికెన్ లలో పోలిక్ యాసిడ్ లభిస్తుంది. అరటి పండ్లు బంగాళాదుంపలలో పొటాషియం లభిస్తుంది. ఇటువంటి ఆహారాన్ని గనుక మన భోజనంలో భాగంగా చేసుకుంటే కొంతవరకు గుండె అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
* ఆహారంలో మార్పులతో పాటు కొంత వయసు వచ్చిన తర్వాత తరచుగా డాక్టర్ని సంప్రదించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి.
* డాక్టర్ సలహా మీద మందులు వాడుకోవాలి.





Untitled Document
Advertisements