పెట్రోల్‌ అమ్మిన అనుష్క..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 04:05 PM

పెట్రోల్‌ అమ్మిన అనుష్క..

హైదరాబాద్, ఫిబ్రవరి 4: టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్క పెట్రోల్‌ అమ్ముతుంది. అదేంటి అనుష్క పెట్రోల్ అమ్మడం అనుకుంటున్నారా.. అదేనండి బుల్లితెరపై మంచు లక్ష్మీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న 'మేము సైతం-2 ' షోకి అనుష్కకి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో భాగంగా విరాళాలు సేకరించడానికి అనుష్క పెట్రోల్ అమ్మింది.

ఈ విషయాన్నీ మంచు లక్ష్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. 'రేపటి నుంచి 'మేముసైతం' సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్‌నగర్‌ రోడ్‌నంబరు 1లో అనుష్క విరాళాలు సేకరించనున్నారు. వెళ్లి సాయం చేయండి' అని ట్విట్ చేశారు.

Untitled Document
Advertisements