నరేష్, పవిత్ర లోకేశ్ ల 'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే.. జరిగేది అక్కడే

     Written by : smtv Desk | Sat, May 20, 2023, 12:32 PM

నరేష్, పవిత్ర లోకేశ్ ల 'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే.. జరిగేది అక్కడే

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేర్లు నరేష్ మరియు పవిత్ర లోకేశ్. ఎక్కడ చూసినా ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి విషయానికి వస్తే.. పవిత్ర లోకేశ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. చూడడానికి పదహారణాల తెలుగింటి ఆడబడుచుల ఎంతో ఒద్దికగా, హుందాగా కనిపిస్తుంది. ఇక హీరోగా నరేశ్ అనేక చిత్రాలలో నటించాడు. ఆ తరువాత కాలంలో ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమా అంటూ లేదు. అలాంటి నరేశ్ మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు హీరోగా రావడానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

నరేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా పేరే 'మళ్లీ పెళ్లి'. ఆయనే విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. తన వయసుకి తగిన పాత్రలోనే ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రేపు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది.

ఈ సినిమాలో పవిత్ర లోకేశ్ కథానాయికగా కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో వనిత విజయ్ కుమార్ కనిపించనుంది. కొంతకాలంగా నరేశ్ - పవిత్ర లోకేశ్ గురించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి కలిసి, తమ జీవితంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను కలుపుతూ ఈ సినిమా చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements