రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరిదాకా పోరాటం : సుజనా

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 05:03 PM

రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరిదాకా పోరాటం : సుజనా

అమరావతి, ఫిబ్రవరి 4 : బడ్జెట్ పై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. టీడీపీ పార్లమెంటరీ సమావేశాల అన౦తరం మీడియాతో మాట్లాడిన సుజనా.. పార్లమెంటులో తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సూచించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరివరకు కేంద్రంతో ఓపికగా పోరాడతామన్నారు.

రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్ డిమాండ్‌లను కేంద్రం నెరవేర్చాల్సి ఉందన్నారు. ఒకవేళ తమకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకపోతే తర్వాత జరిగే కార్యాచరణపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమవుతుందా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. "ఖచ్చితంగా..! తమకు సంకల్ప బలం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements