ఆస్ట్రేలియా ప్రధానిని దీపావళి వేడుకలకు ఆహ్వానించిన మోదీ

     Written by : smtv Desk | Wed, May 24, 2023, 12:37 PM

ఆస్ట్రేలియా ప్రధానిని దీపావళి వేడుకలకు ఆహ్వానించిన మోదీ

భారత ప్రధాని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు భారతదేశానికి రావాలంటూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. బుధవారం అల్బనీస్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత అల్బనీస్ ను మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు. ఈ ఏడాది జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను చూసేందుకు రావాలని పిలిచారు.

సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. హౌస్‌లోని సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. కాగా, అంతకుముందు మంగళవారం ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార నేతలతో మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. సాంకేతికతతో పాటు వివిధ రంగాల్లో భారతీయ కంపెనీలతో సహకారం పెంపొందించుకోవాలంటూ వారికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements