అలోవకగా బాదేశారు..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 06:13 PM

అలోవకగా బాదేశారు..

సెంచూరియన్, ఫిబ్రవరి 4 : దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఆరు వన్డేల సిరీస్ లో 2-0 తో ముందంజ వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు చాహల్, కులదీప్ యాదవ్ ధాటికి 118 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. తర్వాత భారత్ జట్టు ఒక వికెట్ నష్టానికి 20.3 ఓవర్లలోనే 119 పరుగులు చేసి గెలుపొందింది.

స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ(15) పరుగులకే రబాడ బౌలింగ్ లో క్యాచ్ గా వెనుదిరగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి(46), శిఖర్ ధావన్(51) తో జత కలిసి లక్ష్యాన్ని అలోవకగా బాదేశారు. ఈ క్రమంలో ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయిదు వికెట్లు తీసి ప్రోటీస్ వెన్నువిరిచిన చాహల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకున్నాడు. సిరీస్ లో భాగంగా మూడో వన్డే కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

Untitled Document
Advertisements