సర్వరోగ నివారణిగా తులసి..

     Written by : smtv Desk | Tue, May 30, 2023, 11:57 AM

 సర్వరోగ నివారణిగా తులసి..

హైందవ సంస్కృతికి సంప్రదాయాలకు నిలయమైన ప్రతి ఇంటి లోగిళ్ళలో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. తులసి లో 4,5 రకాలు ఉన్నాయి. అందులో ఇంటి లోపల పెంచేవి లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. కృష్ణ తులసి కి మందు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుతుందో తులసి మాత ఈ సమాజాన్ని అనారోగ్యం నుండి అంతగా కాపాడుతుంది. దాని చుట్టూ ఆరు అడుగుల దూరం వరకు ఆరా ఉంటుంది.( రేడియేషయ్ ) దాని ఆరా వల్ల సర్వరోగాలు దూరమవుతాయి. అందువల్లనే ఆ రోజు తులసికి పూజలు చేస్తారు. తులసి వాసనకే ఎన్నో రోగాలు దూరం అవుతాయి. తులసి ఉన్న ఇంట్లో, దేశవాలి ఆవు ఉన్న ఇంట్లో డాక్టర్ ఉన్నంత విలువగా భావిస్తారు. వాత,పిత్త, కఫాలను అదుపు చేస్తుంది. ముఖ్యంగా అంటువ్యాధులను కఫా రోగాలను,ఉదర రోగాలను,గుండె రోగాలను పోగొట్టడానికి ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఇది ప్రతి రోజు పది ఆకుల వరకు తింటే సర్వరోగాలను దూరం చేస్తుంది. ఇంత గొప్ప శక్తి ఉన్న తులసి ఇంటింటా పెంచుకుందాం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం..
తులసి ఆకుల కషాయం జ్వర  తీవ్రతను తగ్గిస్తుంది. వర్షాకాలంలో మలేరియా లాంటి వైరల్ జ్వరాలకు ఇది విరుగుడు.
తులసి ఆకులతో ఆవిరి పడితే జలుబు దగ్గు నుండి  ఉపశమనం కలుగుతుంది.
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఈ కషాయం తాగితే మంచి ఫలితాలు కనబడతాయి. ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా ప్రశాంతత ఏర్పడుతుంది.ఆశీమథేరపి తెరపి అంటే ఇదే.
తులసి ఆకులను మరిగించి టీ తయారు చేసుకోవచ్చు. టీకి మంచి సువాసనతో పాటు ఘాటైన సువాసన కూడా వస్తుంది. వానాకాలంలో మంచి మేలు చేస్తుంది.
ఏడాది నిండిన పిల్లలకు, రోజుకు ఒక చెంచా రసం తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది. పిల్లలకు తరచూ వచ్చే జలుబు, దగ్గు,జ్వరాలు నుండి కాపాడుతుంది.
కండ్లు మండుతున్న,ఎరుపుగా ఉన్న కషాయం పలుచగా చేసి కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
నీడలో ఆరబెట్టి తులసి  ఆకుల పొడిని చేసి టీ స్పూన్ పొడి చిటికెడు సైంధవ లవణం కలిపి పండ్లు తోమితే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన, వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
తులసి ఆకు రసం కు సమానంగా అల్లం రసం కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
తులసి ఆకు పొడి లో పెసరపిండి కలిపి వంటికి  రాసుకుంటే స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి.
తులసి ఆకు రసం తో సమానంగా నిమ్మరసం కలిపి చర్మ వ్యాధులు ఉన్నవారు రాసుకుంటే తగ్గిపోతుంది.
100 గ్రాముల తులసి పొడి, 25 గ్రాముల సొంఠిపొడి, పది గ్రాముల పసుపు, 10 గ్రాముల వెల్లుల్లిపాయలు, 10 గ్రాముల ఆవాలు, 25 గ్రాముల సబ్జా కు పొడి, 10 గ్రాముల కనుగాకు పొడి, 10 తమలపాకుల పొడి, పది గ్రాముల పసుపు అన్ని పొడులు కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని ముక్కుల ద్వారా పిలిచి  నశ్యం వలె పీల్చితే జలుబు మన దరిదాపులకు రాదు. శ్వాస మంచిగా ఆడుతుంది.  దగ్గు రాదు. సైనసైటిస్, తలనొప్పిని కూడా అదుపుచేస్తుంది.





Untitled Document
Advertisements