అజీర్తికి కొత్తిమీరతో చెక్ !

     Written by : smtv Desk | Tue, May 30, 2023, 12:05 PM

అజీర్తికి కొత్తిమీరతో చెక్ !

కొత్తిమీర లేకుండా వంట చేయడం అనేది చాలా కష్టమైన పని. కొత్తిమీరని రకరకాల వంటల్లో వాడడం మనం చూస్తూనే ఉంటాము. అలాగే కొత్తిమీరని పచ్చడిగా కూడా చేసుకుంటారు. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గాలంటే కొత్తిమీర పచ్చడి తినాలి. విటమిన్ సి,ఫాస్ఫరస్,ఐరన్,కెరోటిన్ కార్బోహైడ్రేట్స్ విరివిగా లభిస్తాయి. ఆకులు నేరుగా తింటే ఆకలి పెరుగుతుంది. కొత్తిమీర ఎండబెట్టి కూరలో వాడుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక కట్ట రసం తాగితే నిద్ర బాగా పడుతుంది. కొత్తిమీర మెత్తగా దంచి చర్మానికి రాసుకుంటే, ముడతలు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది. అన్నీ కూరలతో కొత్తిమీర వాడటం వలన రుచి వస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కొత్తిమీరను కూరల్లో దించే ముందు వాడుట వలన దానిలోని పోషక విలువలు చక్కగా మన శరీరానికి అందుతాయి.





Untitled Document
Advertisements