వేరుశనగలలో కొవ్వు ఉంటుందా?

     Written by : smtv Desk | Tue, May 30, 2023, 12:29 PM

 వేరుశనగలలో కొవ్వు ఉంటుందా?

వేరుశెనగలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ప్రతి ఉదయం మనం తీసుకునే బెక్ ఫాస్ట్ లో తాయారు చేసుకునే ఇడ్లీ, దోశ వంటి వాటిలోకి ఈ వేరుశెనగలతో చట్ని తయారు చేస్తారు. ఎప్పుడైనా ఏమి ఉసుపోక ఏదైనా తినాలి అనిపించినప్పుడు వీటిని కాస్త నూనెలో వేపి ఉప్పు, కారం జల్లుకుని తినడం కూడా మనకు అలవాటే. అయితే ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది అనే భయం అందరిలోనూ ఉంటుంది. నిజానికి వేరుశెనగ దానికి సంబంధించిన ఉత్పత్తులలో కొలెస్ట్రాల్ వుండదు అని తాజా పరిశోధనలో తేలింది. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు పోలిక్ ఆసిడ్ ఇటువంటి వన్నీ పుష్కలంగా లభిస్తాయి. గుప్పెడు వేరుశెనగ ల వలన మనకు అవసరమైన విటమిన్ ఈ లో 25°/° లభిస్తుందట. రక్తంలో హానిచేసే కొలెస్ట్రాల్ ని, తగ్గించడానికి అవసరమైన మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, పోలి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వేరుశనగలో ఉన్నాయి.





Untitled Document
Advertisements