అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు కొరకు విధించిన 5 షరతులు ఇవే!

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 11:36 AM

అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు కొరకు విధించిన 5 షరతులు ఇవే!

మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అవినాశ్ కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచికత్తుతో రెండు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరపడం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచించింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ చూపెట్టలేకపోయిందని తీర్పులో హైకోర్టు తెలిపింది.

Untitled Document
Advertisements