అభిమాని కోసం అనూహ్యమైన లారెన్స్ నిర్ణయం..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 07:42 PM

అభిమాని కోసం అనూహ్యమైన లారెన్స్ నిర్ణయం..

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఓ హీరో అన్నాక అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. వారు ఎదుటపడినప్పుడు ఒక్కసారి వారితో ఫోటో దిగితే బాగుంటుంది ఆశ పడతారు. అలాగే ఓ అభిమాని (శేఖర్) ఎంతో ఆశపడి తన ఫేవరేట్ హీరోతో ఫోటో దిగుదామని వెళ్లి అనంతలోకాలకు వెళ్ళాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్. ఈ సంఘటనతో ఆయన అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

అదేంటంటే.. శేఖర్ లాంటి ఘటన ఎవరికీ రాకుడదని, ఇకపై ఆయనతో కలిసి ఫొటో దిగేందుకు అభిమానులు ఎవరు రానవసరం లేదు. అభిమానుల వద్దకే తాను వస్తానని, ఇక నుంచి, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులు ఉండే ప్రాంతాలకు వెళ్లి వారితో కలిసి ఫొటోలు దిగుతానని చెప్పారు. ఈ నెల 7న సేలంకు వస్తున్నట్లు, శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విట్ చేశారు.

Untitled Document
Advertisements