అందుబాటులోకి సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్లు.. రోజూ 3జీ డేటా

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 02:32 PM

అందుబాటులోకి సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్లు.. రోజూ 3జీ డేటా

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం చాల ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మరియు మనం పనిచేసే చోట ఇంటర్నెట్ సౌకర్యం ఉండడంతో మనం వైఫై ద్వారా ఫోన్ లో మనకు కావలసిన వర్క్ చేసుకుంటాము. అదే మనం బయట ఎక్కడైనా ఉన్న సందర్భంలో ఎక్కువగా మనకు ఇంటర్నెట్ అవసరం ఉన్నప్పుడు ప్రస్తుతం మన ఫోన్ లో వచ్చే డేటా సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వారి కోసమే ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పలు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి.

ఎయిర్ టెల్ రూ.399
ఈ ప్లాన్ లో రోజువారీ 3జీబీ హైస్పీడ్ డేటా తోపాటు, ఉచిత కాలింగ్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు వస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు. అపోలో 24/7, ఎక్స్ ట్రీమ్ యాప్ సేవలు ఉచితం.

ఎయిర్ టెల్ రూ.499
పైన చెప్పుకున్న మాదిరే ప్రయోజనాలను ఈ ప్లాన్ కూడా ఆఫర్ చేస్తోంది. వ్యాలిడిటీ 28 రోజులు. కాకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మూడు నెలల చందా ఉచితంగా దీంతో లభిస్తుంది.

ఎయిర్ టెల్ రూ.699
ఈ ప్లాన్ కూడా రోజువారీ 3జీబీ హైస్పీడ్ డేటా, ఉచిత కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్లు అన్నింటిలోనూ 5జీ సేవలు ఉచితం.

జియో రూ.219
దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్ లు వాడుకోవచ్చు. అన్ని జియో యాప్ ల యాక్సెస్ ఉచితం.

జియో రూ.399
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులోనూ పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు వస్తాయి.

జియో రూ.999
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. పైన చెప్పుకున్నట్టే అన్ని ప్రయోజనాలకు అర్హులు.





Untitled Document
Advertisements