మోకాలి గాయంతో బాధపడుతున్న ధొని.. వారం రోజులలో కోకిలాబెన్ హాస్పిటల్ లో మొదలవనున్న చికిత్స

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 02:47 PM

మోకాలి గాయంతో బాధపడుతున్న ధొని.. వారం రోజులలో  కోకిలాబెన్ హాస్పిటల్ లో మొదలవనున్న చికిత్స

కూల్ కెప్టెన్ గా పేరున్న ధొని ఐపీల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు సారధిగా వ్యవహరించారు. అయితే గతకొంతలంగా ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడాడు. మరోవైపు ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో మోకాలి గాయానికి ధోనీ చికిత్స తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చికిత్స ప్రారంభం అవుతుందని చెపుతున్నారు. ఐపీఎల్ ప్రారంభం సమయంలోనే ధోనీ మోకాలి గాయం గురించి చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడాడు. ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని... అతని కదలికల్లో దాన్ని మనం గుర్తించవచ్చని అన్నాడు. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై జట్టు ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇంకోవైపు తన రిటైర్మెంట్ పై ధోనీ మాట్లాడుతూ రిటైర్మెంట్ కు సంబంధించి ధోనీ మాట్లాడుతూ, ఆట నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని.... అయితే అభిమానుల కోసం మరో ఐపీఎల్ లో ఆడతానని చెప్పాడు.

Untitled Document
Advertisements