మీర్ పేటలో దారుణం.. ముగ్గురి వరుస హత్యలు...

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 10:34 AM

మీర్ పేటలో దారుణం.. ముగ్గురి వరుస హత్యలు...

హైదరాబాద్, ఫిబ్రవరి 5 : హైదరాబాద్ మీర్ పేటలో తెల్లవారుజామున దారుణం వెలుగుచూసింది. జిల్లెలగూడలో ముగ్గురు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. జ్యోతి(33) అనే మహిళ సహా అభితేజ్(6), సహస్త్ర(5) అనే ఇద్దరు చిన్నారులు దారుణహత్యకు గురయ్యారు. జ్యోతి భర్త హరిందర్ గౌడ్ ఈ మూడు హత్యలు చేసినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో అతనే వచ్చి పోలీసుల ఎదుట ఒప్పుకొని లొంగిపోయాడు. అయితే హరిందర్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు అనేది తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే కారణమా.? అనే కోణంలో పోలీసులు హరిందర్ ను విచారించనున్నారు.

Untitled Document
Advertisements