వేలానికి వెళ్లిన బీసీసీఐ వెబ్‌సైట్‌..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 11:21 AM

వేలానికి వెళ్లిన బీసీసీఐ వెబ్‌సైట్‌..

ముంబయి, ఫిబ్రవరి 5 : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్‌సైట్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. బోర్డు అధికారులు డొమైన్ ను పునరుద్ధరించుకోవడంలో విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆదివారం 12 గంటలు పైగా ఈ సైట్‌ పని చేయలేదు. బోర్డు డొమైన్‌ కాలవ్యవధి 2–2–2006 నుంచి 2–2–2019 వరకైతే... ఏడాది ముందే అంటే తేదీ 3–2–2018లోపు రెన్యువల్‌ (పునరుద్ధరణ) చేసుకోవాలి. కానీ క్రికెట్‌ బోర్డు ఆ పని చేయకపోవడంతో వెబ్‌సైట్స్‌ రిజిస్ట్రార్స్‌ రిజిస్టర్‌.కామ్‌ ఆ డొమైన్‌ను వేలానికి పెట్టింది. అయితే వెబ్‌సైట్‌ పునరుద్ధరణ గురించి, ఆగిపోయిన సంగతిని బీసీసీఐ ఆలస్యంగా గుర్తించింది. వెంటనే తేరుకున్న బీసీసీఐ డొమైన్‌ను పునరుద్ధరించింది.

Untitled Document
Advertisements