రాజ్యసభలో రచ్చ.. సభ వాయిదా..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 12:48 PM

రాజ్యసభలో రచ్చ.. సభ వాయిదా..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : "ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా" అంశంపై నేడు పెద్దల సభలో దుమారం చెలరేగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్ని వెంటనే అమలు చేయాలని ప్రతిపక్ష కాంగెస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ రామచంద్రరావు అధ్యక్షతన కాంగ్రెస్ ఎంపీల౦తా నినాదాలు చేస్తూ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ నిర్వహణకు ఆటంకం కలిగించోద్దని సర్ది చెప్పినా నిరాశే ఎదురైంది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

Untitled Document
Advertisements