2019 లో రానున్న కపిల్ దేవ్ బయోపిక్‌..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 03:15 PM

2019 లో రానున్న కపిల్ దేవ్ బయోపిక్‌..

ముంబయి, ఫిబ్రవరి 5 : ప్రస్తుతం అన్నీ చిత్ర పరిశ్రమలలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఆదరణ కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది విడుదలైన ధోనీ, సచిన్‌ బయోపిక్‌లు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. 1983లో కపిల్‌దేవ్‌ నాయకత్వంలోని భారత్‌ తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది.

గత ఏడాది ఆగస్టు 30న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి చిత్ర బృందం ప్రపంచకప్‌ అందుకున్న క్రీడాకారులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అప్పుడే సినిమా పేరును ‘83’గా వెల్లడించిన చలనచిత్ర బృందం తాజాగా ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేసేదీ తెలిపింది. ‘అభిమానులారా మీ క్యాలెండర్‌లో 2019 ఆగస్టు 30ని మార్క్‌ చేసుకోండి. ఆ రోజే 83 రిలీజ్‌ కానుంది’ అని చిత్ర బృందం వెల్లడించింది.

Untitled Document
Advertisements