మేజర్ల పెళ్లిపై ఎవరు జోక్యం చేసుకోవద్దు : సుప్రీం

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 04:30 PM

మేజర్ల పెళ్లిపై ఎవరు జోక్యం చేసుకోవద్దు : సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : పరువు హత్యలు రోజు రోజుకు ఎక్కువవుతున్న తరుణంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుంటే.. ఆ వివాహంతో మూడో వ్యక్తికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సమాజమైనా, తల్లిదండ్రులైనా ఎంతటి వారైనా వారికి దూరంగా ఉండాల్సిందే. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా స్పష్టం చేశారు.

పరువు హత్యలపై గ్రామాల్లో సొంత౦గా ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానాలు ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు దారుణమైన శిక్షలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శక్తి వాహిని అనే ఎన్జీవో పిటిషన్‌ దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. "వివాహం చేసుకున్న జంటల హక్కుల కోసమే ఆందోళన చెందుతున్నాం. ఆ వివాహం మంచిదా.? చెడ్డదా.? అనే విషయం మాకు అవసరం లేదు" అంటూ కోర్టు వెల్లడించింది.

Untitled Document
Advertisements