సఫారీలకు మరో షాక్..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 05:02 PM

సఫారీలకు మరో షాక్..

కేప్‌టౌన్, ఫిబ్రవరి 5‌: "మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు" తయారయ్యింది దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు పరిస్థితి. ఇప్పటికే గాయంతో డివిలియర్స్‌ మూడు వన్డేలకు, సారథి డుప్లెసిస్ వన్డే, టీ-20 సిరీస్ కు దూరమైనా సంగతి తెలిసిందే. ఇప్పుడు సఫారీలకు మరో షాక్ తగిలింది. తాజాగా మరో కీలక ఆటగాడు క్వింటాన్‌ డీకాక్‌కు మణికట్టు గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలిగాడు. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత పేసర్‌ బూమ్రా వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి డీకాక్‌ చేతికి బలంగా తాకింది.

ఈ గాయం కారణంగా మిగిలిన నాలుగు వన్డేలతో పాటు మూడు ట్వంటీ -20ల సిరీస్‌కు డీకాక్‌ దూరం కానున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. డర్బన్, సెంచూరియన్, లో గెలిచి భారత్ ఆరు వన్డేల సిరీస్ లో 2-0 తో ముందంజ వేసింది. మూడో వన్డే ఈ నెల 7న కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

Untitled Document
Advertisements