అంత్యోదయ సిద్ధాంతం వైపే బీజేపీ మొగ్గు : అమిత్ షా

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 05:17 PM

అంత్యోదయ సిద్ధాంతం వైపే బీజేపీ మొగ్గు : అమిత్ షా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : బీజేపీ ప్రభుత్వం.. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తుందని రాజ్యసభ సభ్యుడు అమిత్ షా పేర్కొన్నారు. కాంగెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ మేరకు అమిత్ షా.. "లాల్‌బహుదూర్‌ శాస్త్రి స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీనే. స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లయినా పేదవాడికి బ్యాంకు ఖాతా లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు తెరిపించాం. ఎలాంటి దళారులు లేకుండా నేరుగా రాయితీలు లభ్దిదారులకే చెందేలా పక్కా ప్రణాళికలు రూపొందించాం. పేదలందరికి వంటగ్యాస్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అంతే కాకుండా "అంత్యోదయ లక్ష్యం"(అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాల వారికి చేరువ చేయడ౦) గా పనిచేస్తుంది" అని వెల్లడించారు.

Untitled Document
Advertisements