భర్తపై దుండగుల దాడి.. కాపాడేందుకు భార్య సాహసం

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 05:49 PM

భర్తపై దుండగుల దాడి.. కాపాడేందుకు భార్య సాహసం

లక్నో, ఫిబ్రవరి 5 : కళ్ల ముందే దుండగులు తన భర్తను కొడుతుంటే తట్టుకోలేని భార్య అత్యంత సాహసంతో వారిపై బుల్లెట్ల వర్షం కురిపించి౦ది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని కాకోరి పోలీసు స్టేషన్ పరిధిలోని అబిద్ అలీ అనే వ్యక్తి ఇంటి ముందు మాట్లాడుతున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి అతనిపై దాడి చేశారు. భర్త అరుపులు విన్న అతని భార్య తన వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్‌తో దుండగులపై కాల్పులు జరిపింది. దీంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. వెళ్లిపోతూ ముందు ముందు ఇంకా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది అని హెచ్చరిస్తూ మరి వెళ్ళారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డు కాగా అబిద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వృత్తిరీత్యా అబిద్ అలీ భార్య లాయర్ అని సమాచారం.

Untitled Document
Advertisements