టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నా మాజీఎమ్మెల్యే..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 12:37 PM

టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నా మాజీఎమ్మెల్యే..

మహబూబాబాద్, ఫిబ్రవరి 6 ‌: మహబూబాబాద్‌ మాజీఎమ్మెల్యే బండి పుల్లయ్య తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకుడిగా ఎదిగిన ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఏపీ సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 7న హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఆయన చేరిక ఉంటుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 1994 స ంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం మిత్ర పక్షాల సీపీఐ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999 తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో 2001లో టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుల్లో సభ్యుడిగా పనిచేశారు. తర్వాత క్రమంలో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ నెలకొల్పిన నవతెలంగాణ పార్టీ లో చేరారు.

Untitled Document
Advertisements