విన్నూతంగా నిరసన తెలిపిన ఎంపీ..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 01:11 PM

విన్నూతంగా నిరసన తెలిపిన ఎంపీ..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగిందని నిన్న పార్లమెంట్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే చిత్తూరు పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన శివప్రసాద్ మంగళవారం నారదుడి వేషంలో పార్లమెంటు ఆవరణలో కలియ తిరుగుతూ నిరసన తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు నిన్నటి నుంచి పార్లమెంటులో ఆందోళనకు దిగారు. కాగా వ్యక్తిగతంగా నటుడు అయిన శివప్రసాద్ పార్లమెంటు బయట నారదుడి వేషం ధరించి ఓం నమో నారాయణ అంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ఇంతకుముందు చాలా సార్లు కేంద్రప్రభుత్వ తీరుపై విన్నూతంగా నిరసనలు చేపట్టారు.

Untitled Document
Advertisements