ఈ నెల 21న జనసేనాని సిక్కోలు పర్యటన..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 03:20 PM

ఈ నెల 21న జనసేనాని సిక్కోలు పర్యటన..

హైదరాబాద్, ఫిబ్రవరి 6 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో ఈ నెల 21న పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చాలని గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో దీక్షలు నిర్వహిస్తున్న నేపధ్యంలో వారితో సమావేశం కానున్నారు. ‘శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న దీక్ష భగ్నం అయిందని తెలిసింది. శ్రీకాకుళం చైతన్యవంతమైన జిల్లా. పోరాటాలకు ముందుండే జిల్లా. ఇక్కడ ఇలా జరగడం బాధాకరం’ అని హైదరాబాద్‌లో సోమవారం తనను కలిసిన మత్స్యకార నాయకులతో ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంలో జిల్లా పర్యటన తేదీను వెల్లడించారు. మత్స్యకారుల ఇబ్బందులన్నీ తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఇప్పటికే పవన్ సినిమాలకు దూరంగా కేవలం ప్రజల కోసమే పోరాడతానని చెప్పిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements