ఒకే సిరంజి వాడడంతో 40 మందికి ఎయిడ్స్..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 03:33 PM

ఒకే సిరంజి వాడడంతో 40 మందికి ఎయిడ్స్..

ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 6 : 40 మంది ఒకేసారి ఎయిడ్స్ బాధితులుగా తేలడంతో స్థానికంగా కలవరపాటు మొదలైంది. తానూ వైద్యుడినంటూ చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన వద్దకు వచ్చే రోగులలో దాదాపు 40 మందికి ఒకే సిరంజిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బంగార్మావ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థకు ప్రత్యేక కేంద్రంగా ఉన్న ఉన్నావ్ లో ఈ దారుణం జరిగినట్లు సమాచారం.

ఈ మేరకు యూపీ ఆరోగ్యమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ.. "ఇంతటి దారుణానికి కారణమైన ప్రతి ఒకరిపైనా చర్యలు తీసుకుంటా౦. ఈ ప్రాంతం ఎక్కువగా రవాణాకు ముఖ్య కేంద్రం కావడంతో హెచ్‌ఐవీ సోకినా వాహన డ్రైవర్లు సైతం ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చే ట్రక్ డ్రైవర్లందరిని గుర్తించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం" అన్నారు.

కాగా గతేడాది జరిగిన ఓ హెల్త్ క్యాంపు సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మరోసారి సరైన విధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే మరో 500 కేసులు బయటపడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Untitled Document
Advertisements