"రెయిడ్" చిత్ర ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ విడుదల..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 04:15 PM


ముంబై, ఫిబ్రవరి 6 : బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న "రెయిడ్" చిత్ర ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ లను చిత్రబృంద౦ ఒకేసారి విడుదల చేసింది. అజయ్.. మూట కట్టి ఉన్న సంచులు, చుట్టూ డబ్బు, బంగారు బిస్కెట్స్, సీజ్ చేసిన పెట్టెపై అలా కూర్చోవడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. "పేదరికం వల్ల ప్రజలంతా పేదలుగా మారడం లేదు. కాని నీలా దేశం మీద పడి దోచుకు తింటున్న ధనికుల వల్ల మాత్రం ప్రజలు పేదవాళ్ళుగా మారుతున్నారు" అంటూ అజయ్ దేవగన్ ఆవేశంగా చెప్పడం ఆకట్టుకుంది. కాగా రాజ్‌కుమార్‌ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు౦డగా అజయ్‌కి జోడీగా ఇలియానా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. టీ-సిరీస్‌, పనోరమా స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Untitled Document
Advertisements