కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 04:48 PM

కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : ఏపీ రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగడానికి కాంగ్రెస్ కారణమంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న క్రమంలో కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గందరగోళ వాతావరణంలో స్పీకర్‌ సభను కాసేపు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా రాజ్యసభలో టీడీపీ ఎంపీల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియపరుస్తున్నారు.

Untitled Document
Advertisements