హామీలపై కట్టుబడే ఉన్నాం : జైట్లీ

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 05:41 PM

హామీలపై కట్టుబడే ఉన్నాం : జైట్లీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడే ఉన్నామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పై విధంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించామన్న ఆయన.. ఆ ప్యాకేజ్ ఎలా ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. జనవరి 3వ తేదీన సీఎం చంద్రబాబు తమకు లేఖ రాశారని, ఆ లేఖలో నాబార్డు ద్వారా నిధులు కేటాయించాలని కోరినట్లు జైట్లీ చెప్పారు. దీనికి సమాధానంగా జైట్లీ.. నాబార్డు ద్వారా నిధులు ఇవ్వాలంటే సమస్య ఎదురవుతోందని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ నిధుల మంజూరు చేసే అంశంపై చర్చిస్తున్నామని వివరించారు.

Untitled Document
Advertisements