ముచ్చటగా మూడోసారి..

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 11:39 AM

ముచ్చటగా మూడోసారి..

కేప్‌టౌన్‌, ఫిబ్రవరి 7 : దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ప్రోటిస్ పై వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా క్రికెట్ జట్టు ముచ్చటగా మూడో సారి విజయంపై కన్నేసింది. ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలుపొంది 2-0తో ఆధిక్యంలో నిలిచింది, కాగా ఈ రోజు కేప్‌టౌన్‌ వేదికగా మూడో వన్డేకు ఇరుజట్లు సిద్దమయ్యాయి.

ఇంతవరకు భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు మించి గెలిచింది లేదు. మరోవైపు ఆతిధ్య జట్టులో గాయాలతో స్టార్ ఆటగాళ్లు డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్ దూరం కావడంతో ఆ టీం పుంజుకోవడం కష్టమే..! . కోహ్లి సేన అతివిశ్వాసంకు పోకుండా ఆడితే సఫారీ గడ్డపై మరో చిరస్మరణీయమైన విజయం తథ్యం. కాగా సఫారీ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆశలు నిలుపుకోవాలని చూస్తుంది.

Untitled Document
Advertisements