సల్మాన్ ఖాన్ 'కిక్ 2' వచ్చేస్తుంది..!

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 12:10 PM

సల్మాన్ ఖాన్ 'కిక్ 2' వచ్చేస్తుంది..!

ముంబయి, ఫిబ్రవరి 7 : టాలీవుడ్ లో మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘కిక్‌’ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ఇదే సినిమాను హిందీలో సల్మాన్‌ ఖాన్‌ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా హిందీలో ‘కిక్‌ 2’ రాబోతోంది. సాజిద్‌ నదియాద్‌వాలా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పుడు సీక్వెల్‌లో సల్మాన్‌తో ఎవరు నటించనున్నారో తెలియాల్సి ఉంది. కాగా ‘కిక్‌ 2’ సినిమాను 2019 క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయనున్నారు.

Untitled Document
Advertisements