పొగమంచు భీభత్సం.. వైరల్ అవుతున్న వీడియో...

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 12:45 PM

పొగమంచు భీభత్సం.. వైరల్ అవుతున్న వీడియో...

అబుదాబి, ఫిబ్రవరి 7 : పొగమంచు కారణంగా ఏకంగా 44 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన అబుదాబిలో చేసుకుంది. దుబాయి-అబుదాబిని కలిపే రోడ్డులో దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో వాహనదారులకు రోడ్డు కన్పించకపోవడంతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనపడకుండా పోయాయి. ఆ మార్గం గుండా వెళ్ళే వాహనాలు అనుకోకుండా ఒకదానికొకటి ఢీకొ౦టూ పోయాయి. అలా ఏకంగా 44 వాహనాలు ఢీకొ౦టూ రోడ్డుపై విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో దాదాపు 22మంది గాయపడగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Untitled Document
Advertisements