కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ సమస్యలు : మోదీ

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 01:27 PM

కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ సమస్యలు : మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో రోజు కూడా లోక్‌సభలో టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ గందరగోళం మధ్యే ప్రధాని ప్రసంగం కొనసాగుతోంది. ఈ ప్రసంగంలో మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే ఇప్పుడు సమస్యలు వచ్చాయని అంతటి మహోన్నత చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంద౦టూ మోదీ గుర్తు చేశారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదు. కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చామని, ఏపీకి అండగా ఉంటామని పేర్కొన్నారు. లోక్ సభలో మోదీ ప్రసంగం ఇంకా ప్రారంభం కాక ముందే వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం గమనార్హం.

Untitled Document
Advertisements