పైరసీని ప్రోత్సహించొద్దు : వి.వి. వినాయక్

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 06:20 PM

పైరసీని ప్రోత్సహించొద్దు : వి.వి. వినాయక్

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ భూతం ఇండస్ట్రీను పట్టిపీడిస్తుంది. మూవీ విడుదలైన కాసేపటికి సినిమా మొత్తం ఆన్ లైన్ లో దర్శనమిస్తుంది. కాగా ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ‘సినిమా పైరసీ చిత్ర పరిశ్రమకు దేవుడు ఇచ్చిన శాపం’ అని వర్ణించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

"పైరసీని నియంత్రించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకట్ట వేయలేకపోతున్నా౦. సరదా కోసం సినిమాలను పైరసీ చేస్తుండటం మూలంగా నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. పైరసీని ప్రోత్సహించొద్దు" అని వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements