అది మాల్దీవుల అంతర్గత విషయం : చైనా

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 06:49 PM

అది మాల్దీవుల అంతర్గత విషయం : చైనా

బీజింగ్, ఫిబ్రవరి : మాల్దీవుల అంశంలో వేరే దేశ సైన్యం జోక్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఈరోజు చైనా పేర్కొంది. రాజకీయ సంక్షోభంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఇతర దేశాల సైన్యం జోక్యం చేసుకోవద్దని డ్రాగన్ దేశం కోరింది. భారత రాయబారులు, సైన్యం జోక్యం చేసుకుని తమ దేశ పరిస్థితిని చక్కబెట్టాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్‌ కోరిన మరుసటి రోజే చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంజ్‌ షువాంగ్‌ మాట్లాడుతూ.. మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయకూడదు. వారి సమస్యను అంతర్గతంగానే పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవాలి. వారికి సమస్యను స్వతహాగా పరిష్కరించుకోగలిగే తెలివితేటలు, సామర్థ్యం ఉన్నాయని మేము నమ్ముతున్నాం. అది మాల్దీవుల అంతర్గత విషయం" అని తెలిపారు.

హిందూ మహా సముద్రంలో ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఆ దేశ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అరెస్ట్ చేయడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ కు లోనయ్యారు. ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని భద్రత దళాలు అరెస్ట్ చేశాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటుకు గురైన విపక్ష ఎంపీల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అధ్యక్షుడు యమీన్‌ ససేమిరా అనడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements