ఏపీ "బడ్జెట్" బంద్..!

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 10:42 AM

ఏపీ

అమరావతి, ఫిబ్రవరి 8 : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి సరైన కేటాయింపులు చేపట్టలేదని, తమకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ నేటి ఆంధ్రప్రదేశ్ బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. బస్సు డిపోలలో బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బంద్ ప్రకటించారు.

అంతేకాకుండా ఇవాళ జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఈనెల 22కు వాయిదా వేశారు. కాగా రాష్ట్రంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. వామపక్షాలు ఏపీ బంద్‌కు పిలుపు ఇవ్వగా కాంగ్రెస్, వైకాపా, జనసేన పార్టీలతో సహా వివిధ సంఘాలు మద్దతు తెలుపుతూ బంద్ లో పాల్గొంటున్నాయి.

Untitled Document
Advertisements