డ్రైవింగ్ లైసెన్స్‌ కు "ఆధార్‌"..!

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 11:46 AM

డ్రైవింగ్ లైసెన్స్‌ కు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : ప్రస్తుతం యావత్ భారతదేశంలో "ఆధార్‌" అనుసంధానం అన్నింటికి ముఖ్యమైనదిగా మారిపోయింది. ఫోన్ లో సిమ్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్ వరకు అన్నింట్లో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్‌లను సైతం ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర౦ సుప్రీంకోర్టుకు తెలిపింది.

నకిలీ లైసెన్సులను ఏరివేసేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత ఏడాది నవంబర్ 28న రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శితో సమావేశమై నకిలీ లైసెన్సులను ఏరివేసే అంశ౦పై చర్చించినట్లు మాజీ న్యాయమూర్తి కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వ కమిటీ వెల్లడించింది. నకిలీ లైసెన్సులను అరికట్టేందుకు సారథి-4 సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

Untitled Document
Advertisements